ఇదే నిజం దేవరకొండ: భూపేష్ గుప్తా నగర్ లో ఎలక్త్రికల్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా సాల్వా చారి అధ్యక్షులు మాట్లాడుతూ సమాజంలో కార్మికుల హక్కుల గురించి ప్రతినిత్యం కొట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ సోదరులందరూ వృత్తిలో క్రమశిక్షణతో ముందుకు కొనసాగాలని ఆకాంక్షించడం జరిగింది. ఎలక్ట్రికల్ దేవరకొండ అధ్యక్షులు పాష , రాష్ట్ర ఎలక్ట్రికల్ విభాగం అధ్యక్షులు రఘు , ప్రధాన కార్యదర్శి విఠల్ , ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైనం నిరంజన్ , ఉపాధ్యక్షులు వెంకటేష్ , ప్రధాన కార్యదర్శి యాదగిరి , వర్కింగ్ ప్రెసిడెంట్ కాశీ నాయుడు ,మరియు రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ , నారగోని యాదయ్య ,శ్రీనివాస్ ,ఓఎల్ఈడి ప్రదినిధులు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు అలాగే లేబర్ కార్డు అందజేశారు.