జపాన్‌లో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ మహిళల టీ20 400 మీటర్ల రేసులో దీప్తి బంగారు పతకం కైవసం చేసుకుంది. తెలంగాణ అమ్మాయి జీవాంజి దీప్తి ఆరంభంలో వెనుకబడినా.. అనంతరం శక్తిని పుంజుకుని ఒక్కో అథ్లెట్‌ను దాటేస్తూ ప్రపంచరికార్డు బద్దలు కొట్టింది. 400 మీటర్ల పరుగును దీప్తి 55.07 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానం దక్కించుకుంది.