Homeఫ్లాష్ ఫ్లాష్Corona Vaccine: మ‌రో 20 ఏండ్లపాటు క‌రోనా ఉనికి.. వ్యాక్సిన్ ప‌రిష్కారం కాదు

Corona Vaccine: మ‌రో 20 ఏండ్లపాటు క‌రోనా ఉనికి.. వ్యాక్సిన్ ప‌రిష్కారం కాదు

ముంబ‌యి: ప‌్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ఉనికి మ‌రో 20 ఏండ్ల పాటు ఉండే అవ‌కాశం ఉంద‌ని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా పేర్కొన్నారు.

జనాభాలో 100 శాతానికి కరోనా టీకా ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ, భవిష్యత్తులోమరో 20 ఏళ్లపాటు ఈ వ్యాక్సిన్‌ల అవసరం తప్పక ఉంటుందన్నారు.

వ్యాక్సిన్ కేవ‌లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది, కానీ వ్యాధి రాకుండా పూర్తిగా నిరోధించదని పూనావాలా అభిప్రాయపడ్డారు.

కరోనావైరస్ విషయంలో కనీసం రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి వ్యాక్సిన్ తీసుకోవాల్సి రావొచ్చ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని నిల‌పేసిన హిస్ట‌రీ లేద‌న్నారు.

ఫ్లూ, న్యుమోనియా, మీజిల్స్, అంత ఎందుకు పోలియో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఒక్కటి కూడా ఇంతవరకూ నిలిపివేయలేదని తెలిపారు.

Recent

- Advertisment -spot_img