చైనాలో జరిగిన అత్యంత లగ్జరియస్ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. 5 రోజుల పాటు నిర్వహించిన ఈ వివాహ వేడుకకు వచ్చిన అతిథుల కోసం ఫైవ్ స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. ట్రావెలింగ్‌కి రోల్స్ రాయిస్ కార్లు, బెంట్లీలు వినియోగించారు. అలాగే అతిథులకు ఎరుపు రంగు పాకెట్స్‌లో రూ.66 వేలు రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇచ్చారు. చైనా సంప్రదాయం ప్రకారం అతిథులు వధువరులకు ఎరుపు పాకెట్స్‌లో డబ్బుని కానుకగా ఇస్తారు.