Homeహైదరాబాద్latest Newsకాసేపట్లో వైసీపీ మ్యానిఫెస్టో విడుదల

కాసేపట్లో వైసీపీ మ్యానిఫెస్టో విడుదల

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే ఎన్నికల మేనిఫెస్టోపై వైసీపీ పూర్తి కసరత్తు చేసింది. నేడు వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం ఉంటుంది. ఓటర్లను ఆకట్టుకునేలా వైసీపీ మేనిఫెస్టో ఉండబోతోందని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ ఐదేళ్లలో ప్రజలను ఆకట్టుకున్న అన్ని పథకాలను కూడా మేనిఫెస్టోలో ఉంచబోతున్నారని సమాచారం. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ నవరత్న పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమలవుతున్న కొన్ని పథకాలను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారట. అలాగే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img