ఏపీ ఎన్నిక ఫలితాల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఓటమిని తట్టుకోలేక కొందరు అభిమానులు మృతి చెందారు. కృష్ణా జిల్లా గుడివాడ సైదేపూడికి చెందిన పిట్ట అనిల్ (28) వైసీపీ ప్రభుత్వం, కొడాలి నాని ఓటమి తట్టుకోలేక ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. అలాగే వైఎస్సార్ జిల్లా దిగువ తంబళ్లపల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త చిన్నయల్లాలు గుండెపోటుతో మరణించాడు. కర్నూలుకు చెందిన ఉరుకుందప్ప (68) టీవీ చూస్తూ వైసీపీ ఓటమిని తట్టుకోలేక తుదిశ్వాస విడిచాడు.