Homeఫ్లాష్ ఫ్లాష్దేనికైనా రెడీ అంటున్న యంగ్ హీరోయిన్.. వాటి కోసం ఏమైనా చేస్తా..?

దేనికైనా రెడీ అంటున్న యంగ్ హీరోయిన్.. వాటి కోసం ఏమైనా చేస్తా..?

కామాక్షి భాస్కర్ల నటించిన ‘మ ఊరి పొలిమెర’ సినిమా పాపులర్‌ అయింది. ఇప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు చేసినా ఈ సినిమాలో చేసిన ఆమెకి ఆ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే విరూపాక్ష, పొలిమేర 2, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రౌడీ బాయ్స్, ఓం భీమ్ బుష్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కామాక్షి భాస్కర్ల. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి బాగా మెప్పించింది. ‘సైతాన్’ వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించి అందరికి షాక్ ఇచ్చింది. అయితే ఇటీవల కామాక్షి ఒక యూట్యూబ్ ఛానెల్‌తో చిట్‌చాట్‌లో హాట్ కామెంట్స్ చేసింది. బోల్డ్ క్యారెక్టర్లు చేయడానికి నేను రెడీ చెప్పింది. అమాయక పాత్ర అయినా, బోల్డ్ పాత్ర అయినా నటికి ఒకటే అని తెలిపింది. కథ ప్రకారం ఓ పాత్ర ఉంటుందని అన్నారు. ఆ రోల్‌ను పండించడం నటిగా నా విధి అని ఆమె అన్నారు. కథ, సన్నివేశం డిమాండ్‌ చేస్తే.. దుస్తులు లేకుండా నటించడానికి కూడా నేను సిద్ధం అని తెలిపారు.

Recent

- Advertisment -spot_img