బెజ్జంకి, ఇదేనిజం : అతివేగంగా వాహనాన్ని నడపడంతో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. బెజ్జంకి మండలంలోని బేగంపేట్ గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని గూడెం గ్రామానికి చెందిన హనుమాండ్ల సందీప్ రెడ్డి (29) వడ్లూరు గ్రామానికి చెందిన పొట్ల రాజు ఇద్దరు కలిసి లక్ష్మీపురం నుంచి గూడెం గ్రామానికి కారులో వస్తున్న క్రమంలో బేగంపేట గ్రామ శివారులో కారు అతివేగంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో సందీప్ అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న రాజును కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు.