HomeసినిమాYoung Tiger NTR: ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌..‌ ఫొటో వైరల్‌

Young Tiger NTR: ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌..‌ ఫొటో వైరల్‌

హైదరాబాద్‌: సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌లో ఉన్న అరుదైన చిత్రాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

ఆయన ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ ఆరంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గతంలో ప్రముఖుల ఫొటోషూట్‌లో తీసిన స్టిల్స్‌ను ఆదివారం షేర్‌ చేశారు.

2018లో ‘అరవింద సమేత’ సినిమా కోసం తారక్‌ ఇలా ఫిట్‌గా తయారయ్యారు. ఆ సమయంలో క్లిక్‌ మనిపించిన ఫొటో అది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లోని కొమరం భీమ్‌ పాత్ర కోసం తారక్‌ ఇంకా ఫిట్‌గా సిద్ధమైన సంగతి తెలిసిందే.

రత్నానీ భారత్‌లోనే అగ్ర ఫ్యాషన్‌ ఫొటో గ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. అనేక మ్యాగజైన్లకు కవర్‌ ఫొటో గ్రాఫర్‌గా కూడా పనిచేశారు.

Recent

- Advertisment -spot_img