Homeహైదరాబాద్latest Newsఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

ఇదేనిజం, కొమురం భీం ఆసిఫాబాద్ : రెబ్బెన మండలం పాసిగాం గ్రామానికి చెందిన రజిత (23) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రెబ్బెన ఏఎస్ఐ లక్ష్మణ్ వివరాల ప్రకారం.. పాసిగం గ్రామానికి చెందిన నికోడే శంకర్ తో 2019 సంవత్సరంలో రజితకు వివాహం అయింది. వివాహం అయిన కొన్ని సంవత్సరాలపాటు వీరి కాపురం బాగానే సాగింది. గత కొంత కాలం క్రితం నుంచి నికోడే శంకర్ తరచూ రజితను పిల్లలు కావడంలేదని తిడుతూ కొడుతూ మానసికంగా శారీరకంగా వేధించేవాడు. ఈ మధ్యకాలంలో అతిగా మద్యం సేవిస్తూ జల్సాలకు అలవాటు పడి ఇంటి వద్దనే ఉంటూ నిత్యం ఏదో ఒక విధంగా వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలో 8వ తేదీ సోమవారం రోజున నికోడే శంకర్ ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చి నీకు పిల్లలు కావడం లేదు నువ్వు బ్రతకడం దండగా చచ్చిపో అని తిట్టాడు. తీవ్ర మనస్థాపానికి గురైన రజిత ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. రజిత తండ్రి మోర్లే గజానంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్ ఐ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img