Homeహైదరాబాద్latest Newsక్లాసులు అర్థమవట్లేదని పుట్టినరోజునాడు యువకుడి ఆత్మహత్య

క్లాసులు అర్థమవట్లేదని పుట్టినరోజునాడు యువకుడి ఆత్మహత్య

తండ్రి పుట్టినరోజును బ్లాక్‌డేగా మార్చాడు ఓ కుమారుడు. పుట్టినరోజునాడు సూసైడ్ చేసుకొని కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. తండ్రి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. దీంతో జిల్లా కేంద్రంలో ఉంటూ ఎంసెట్‌ కోచింగ్ తీసుకుంటున్న తమ కుమారుడికి సైతం ఫోన్ చేశారు. అందరూ కలిసి ఆనందంగా కేక్‌ కట్ చేసి, పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కానీ ఇంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. మళ్లీ వస్తానని చెప్పి బయటకు వెళ్లిన ఆబాలుడు, నదిలో దూకి ఆత్మహత్య(Student Suicide) చేసుకున్నాడు. అంతవరకూ తమ కళ్లముందే మెదిలిన తమ కుమారుడు, విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Son Suicide on Father Birthday : తండ్రి పుట్టిన రోజున కేక్ కట్ చేయించిన కొడుకు, చదువుపై విరక్తి చెంది గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలంలోని నాగేపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, ఇంచార్జ్ ఎస్‌హెచ్‌వో గఫూర్ సమాచారం ప్రకారం నాగేపూర్ గ్రామానికి చెందిన సూర్య (18) నిజామాబాద్‌లోని ఓ కళాశాలలో ఇటీవలే ఇంటర్ పూర్తి చేసి, ఎంసెట్ కోచింగ్‌కు హాజరవుతున్నాడు.

సోమవారం నాడు తండ్రి పుట్టినరోజు కావడంతో, ఆదివారం రాత్రి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులను కలిసిన అనంతరం తనకు చదువు అబ్బడం లేదని, ఎంసెట్ తరగతులు అర్థం కావడం లేదని వారి వద్ద బోరున విలపించాడు. సోమవారం మధ్యాహ్నం తండ్రి పుట్టిన రోజు వేడుకలు చేసి, దుకాణానికి వెళ్లి వస్తానని చెప్పి బైక్‌పై బయటకు వెళ్లాడు. చాలా సమయం తర్వాత తిరిగిరాక పోయేసరికి, అనుమానంతో తండ్రి ఇతరుల బైక్‌పై గోదావరి వద్దకు వెళ్లగా గోదావరి బ్రిడ్జిపై బైక్ ఉండటం చూశారు.

వెంటనే అక్కడ ఉన్న స్థానికులతో కలిసి పడవపై గాలించగా నదిలో మునిగి కొన ఊపిరితో ఉండగా దొరికాడు. హుటాహుటిన నవీపేట్ స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, మరణించినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం కొరకు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img