HomeసినిమాYoutube Star : ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్

Youtube Star : ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్

– ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం
– పెళ్లి పేరు ఎత్తగానే యువతికి దూరం
– పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి ఘటన
– నటుడు చందుసాయిని అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : ప్రముఖ యూట్యూబర్‌ చందుసాయిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. తనను నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నార్సింగికి చెందిన యువతికి యూట్యూబర్‌ చందుసాయి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. 2021 ఏప్రిల్‌ 25న బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు. పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. అతడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు చందుపై అత్యాచారం, చీటింగ్ కేసులు నమోదు చేశారు. చందుతో పాటు అతడి తల్లిదండ్రులు సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


చందు అసలు పేరు చంద్రశేఖర్…


చందుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చంద్రశేఖర్ సాయికిరణ్.. యూట్యూబ్‌లో చందుగాడు పేరుతో బాగా ఫేమస్‌ అయ్యాడు. చందుగాడు, పక్కింటి కుర్రాడు యూట్యూబ్‌ ఛానల్స్‌లో వీడియోలు చేస్తూ డబ్బు, పేరును సంపాదించుకున్నాడు. అతడు చేసే కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలకు లక్షల్లో వ్యూస్‌ వస్తుంటాయి. చందుగాడు యూట్యూబ్‌ ఛానల్‌కు ఐదున్నర లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు.

Recent

- Advertisment -spot_img