Homeహైదరాబాద్latest Newsమంథనిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

మంథనిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

ఇదేనిజం మంథని: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారలశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశానుసారం దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో మంథని లోని ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.నాయకులు మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్,మున్సిపల్ చైర్మన్ పెండ్రూ రమ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, ఎస్సి సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం,మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం చేసి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి ది అని ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిన ఘనత, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేందుకు కృషి చేయడం జరిగిందని 108 ద్వారా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందించడం జరిగిందని జల యజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులను శంకుస్థాపన చేయడం జరిగిందని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి అనగారిన వర్గాలకు ఎంతో మేలు చేయడం జరిగిందని తెలిపారు. ఆ మహనీయుడి ఆశయ సాధనలో శ్రీధర్ బాబు నాయకత్వంలో మంథని ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోలు శివ, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ మస్కుల సురేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకన్న,జనగాం నర్సింగారావు, జిల్లా కార్యదర్శి ఉదరి శంకర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్ల నాగరాజు, కౌన్సిలర్లు నక్క శంకర్,పాపారావు, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు ఆర్ల నారాయణ,యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు గొల్లపెల్లి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎరుకల సురేష్, బిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మోహన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్ నాయకులు తోకల మల్లేష్,మంథని శ్రీనివాస్,పొరండ్ల రంజిత్ కుమార్,రాం రాజశేఖర్, బూడిద రమేష్,నాగుల రాజయ్య,ఆకుల శ్రీనివాస్,రొడ్డా రాజేశ్వర్,కూర కోటేష్,మంథని వేణు,సతీష్,అంకుస్, కావేటి సమ్మయ్య,మద్దెల రవి,గుడెపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img