Homeహైదరాబాద్latest NewsAP : వైసీపీ మ్యానిఫెస్టో విడుదల

AP : వైసీపీ మ్యానిఫెస్టో విడుదల

తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. యువత కోసం తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నైపుణ్యాలు నేర్చుకునే సమయంలో రూ.2500 నుంచి రూ.3000 ఇస్తామన్నారు. విద్యాదీవెన పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

“వైఎస్సార్ చేయూత కింద రూ.75 వేలను నాలుగు విడతల్లో రూ. లక్షా యాభై వేలకు పెంచుతాం. మొత్తం జనాభాలో దళితుల సంఖ్య 50 శాతం, 500 కుపైగా ఉంటే ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేస్తాం. పెన్షన్ రూ. 3000 నుంచి రూ.3500 కు పెంచుతాం. అటో, లారీ, క్యాబ్ డ్రైవర్లకు రూ. 10 లక్షల ప్రమాద బీమా

> 2025 నుంచి ఓకటో తరగతిలో ఐబీ సిలబస్

>రైతు భరోసా రూ. 16 వేలు కొనసాగింపు, కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపు

>యూనివర్సిటీల్లో పెండింగ్‌లో ఉన్న 3590 పోస్టుల భర్తీ

>ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు

>66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం.

>4 పోర్టులు, 10 ఫిషింగ్ హర్బర్లు ఏర్పాటు

>భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరో 18 నెలల్లో పూర్తవుతుంది.

>వచ్చే ఐదేళ్లలో 4 విడతలుగా ఓబీసీ నేస్తం రూ.60000 ఇస్తాం.

>పీపీపీ విధానంలో ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు

>2024 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖ రాజధానిగా పరిపాలన సాగుతుంది. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా పరిపాలన కొనసాగిస్తాం.

>ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం.

>ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్

>రాబోయే ఐదేళ్లలో వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ

>వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల వరకు రుణాలు

>అమ్మ ఒడి రూ.15వేల నుంచి రూ. 17 వేలకు పెంపు

>స్విగ్గీ, జొమాటో వంటి గిగ్ వర్కర్లకు బీమా వర్తింపు”

– సీఎం జగన్

Recent

- Advertisment -spot_img