Homeహైదరాబాద్latest NewsYuvraj Singh: ఈ తరంలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్.. కానీ అతని కెరీర్‌లో అదొక్కటే...

Yuvraj Singh: ఈ తరంలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్.. కానీ అతని కెరీర్‌లో అదొక్కటే లోటు..!

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పై మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ తరంలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని కొనియాడాడు. తాజా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ తరంలో విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని యువి అన్నాడు. ఈ తరం రికార్డులన్నింటినీ విరాట్ బద్దలు కొట్టాడని తెలిపాడు. అతని కెరీర్‌లో ఏమైనా లోటు ఉందా? అది ఒక వరల్డ్ కప్ మెడల్ మాత్రమే అని అన్నాడు. ఇప్పటికే 2011 లో ఒకటి గెలిచినా.. దానికి కోహ్లీ సంతృప్తిగా లేడని యువి యువి అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ మెడల్ అందుకోవడానికి విరాట్ కోహ్లీ పూర్తి అర్హుడని నేను భావిస్తున్న అని యువి అన్నాడు. 2014 టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. అప్పుడు అతను తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అతను బంతిని అద్భుతంగా కొట్టాడు. ఫైనల్‌లో అతనితో చిన్న భాగస్వామ్యంలో నేను భాగమయ్యాను. ఆ తర్వాత ధోనీతో కలిసి బ్యాటింగ్ కొనసాగించాడు’ అని యువరాజ్ సింగ్ అన్నాడు. అయితే ఈ సారి అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి 29 వరకు టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img