కేంద్రం పదేళ్లలో 10 లక్షల కోట్లు రాష్ట్రానికి కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రగతి నివేదన పత్రం పేరుతో కేంద్ర చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మల్కాజ్‌గిరిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని..అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనే ఓటు వేయాలని కోరారు. రానున్న రోజుల్లో బీజేపీ మరిన్ని అభివృద్ది క్రమాలు చేస్తుందని హామీ ఇచ్చారు.