ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని గౌతమ విద్యా మందిర్ పాఠశాలలో 10వ తరగతి చదివిన 2007-2008 బ్యాచ్ కు చెందిన విద్యార్థిని విద్యార్థుల సమ్మేళనం ఆదివారం రోజున రెడ్డి సంఘంలో ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు దాదాపు 16 సంవత్సరాల తర్వాత అందరూ ఒకే చోట గొల్లపల్లిలోని రెడ్డి సంఘంలో కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మతులను,జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని సంతోషంగా గడిపారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి,ఉద్యోగ,వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. నాడు తమకు విద్య బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఎర్ర మల్లేశం,జనప తిరుపతి మాట్లాడుతూ 16 సంవత్సరాల తర్వాత తమను పిలిచి ఇంతటి తీపి జ్ఞాపకాలను ఆస్వాదించేలా చేయడం,ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు గురువులను శాలువలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2007-2008 బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.