కాంగ్రెస్ పార్టీ పేదల కోసం మరో కీలక హామీ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్లో భూమిలేని పేదలకు నెలకు రూ. 4వేలు ఇస్తామని సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మైనార్టీ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని పంటలకు 100 శాతం బీమా కల్పిస్తామని పేర్కొన్నారు. యాపిల్కు కేజీ రూ.72 కనీస మద్దతు ధర ఇస్తామని అన్నారు.