Love Affairs : ఒకేసారి ఇంటికొచ్చిన నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్..
Love Affairs – అతడు జల్సా జీవితానికి అలవాటుపడ్డాడు. ఒకే సమయంలో నలుగురు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం నడిపాడు.
తమకు జరిగిన మోసం గురించి తెలుసుకున్న ఆ నలుగురు యువతులూ ఒకేసారి ఇంటికొచ్చి నిలదీసేసరికి..
సమాధానం చెప్పలేక విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన పశ్చిమబెంగాల్ కూచ్‌బెహర్ జిల్లా మత్తభంగ పట్టణ సమీపంలోని జోర్‌పట్కి అనే గ్రామంలో ఇటీవల చోటుచేసుకుంది.
ఆ వ్యక్తి పేరు సుభమోయ్ కర్. ఒక మెడికల్ స్టోర్‌లో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు.
ప్రేమ పేరుతో చేసిన ఘనకార్యం గురించి తెలుసుకున్న ఆ నలుగురు అమ్మాయిలు కలిసి సుభమోయ్ ఇంటికి వచ్చారు.
తమకు చేసిన మోసంపై వాగ్వివాదానికి దిగారు.
దీంతో వారికి సమాధానం చెప్పలేక సుభమోయ్ గదిలోకి వెళ్లి విషం తాగాడు.
ప్రస్తుతం అతను జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదమేమీ లేదని, పరిశీలనలో ఉంచామని వైద్యులు తెలిపారు.