Group1 exam:గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లను ఆదివారం నుంచి https://www. tspsc.gov. in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ ( TSPSC ) సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. గతంలో రద్దయిన పరీక్ష హాల్‌టికెట్లు చెల్లవని స్పష్టం చేశారు. వెబ్సైట్లో నమూనా ఓఎంఆర్ షీట్ అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించారు.పరీక్షకు మరో వారం గడు వు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లపై టీఎస్పీఎస్సీ ము మ్మర కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతోపాటు ఎగ్జామ్ సూపరింటెండెంట్లతో కమిషన్ అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, హైదరాబాద్‌తోపాటు ప్రధాన నగరాల్లో ట్రాఫి క్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతఅక్టోబర్ 16న ప్రిలిమినరీ నిర్వహించగా, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తో కమిషన్ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మ ధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తామని పకటించింది. కాగా, 503 గ్రూప్1 పోస్టులకు మొత్తం 3,80,202 దరఖాస్తు లొచ్చాయి