– తెలంగాణలో పోటీకి వైఎస్సార్టీపీ దూరం
– కాంగ్రెస్ పార్టీకి మద్దతు
– హస్తం పార్టీ గెలిచే అవకాశం ఉందని షర్మిల కామెంట్
– అడ్డుపడకూడదనే పోటీ నుంచి విరమించుకున్నట్టు ప్రకటన
ఇదేనిజం, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశం ఉందని.. ఆ పార్టీ గెలుపును అడ్డుకోకూడదనే తాము పోటీ నుంచి తప్పుకున్నట్టు పేర్కొన్నారు. తాను పాలేరు బరిలో దిగాలని భావించానని.. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఉన్న అనుబంధంతో ఆ సీటును త్యాగం చేయాలని భావించినట్టు ఆమె చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వం మారే అవకాశం ఉన్నప్పుడు అడ్డుపడటం సరికాదని .. తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశామన్నారు. షర్మిల తెలంగాణలో సుధీర్ఘ పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించారు కూడా.. అయితే వివిధ కారణాల వల్ల ఆపార్టీ పొత్తు కు అంగీకరించలేదు. దీంతో షర్మిల చివరకు పోటీ నుంచే తప్పుకున్నారు.