– ఏటూరునాగారంలో ఘటన
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఓ ఇసుక లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి పెద్ద సమ్మయ్య (55) అనే వ్యక్తి ఏటూరునాగారం అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద హనుమకొండ వెళ్లేందుకు లారీ ఎక్కాడు. ఈ క్రమంలో లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో సమ్మయ్య మృతి చెందాడు. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోవడంతో గ్యాస్ వెల్డింగ్‌తో కట్ చేసి డ్రైవర్‌ను బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. కాగా, మృతుడు పెద్ద సమ్మయ్య హైదరాబాదులో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. దీపావళి పండుగకు తన స్వగ్రామమైన మంగపేట మండలం కోమటిపల్లి కొచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో ప్రమాదానికి గురై మృతి చెందాడు. సమ్మయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.