నాగ చైతన్య మెయిన్ లీడ్‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ ‘దూత’. అమెజాన్ ప్రైమ్ దీన్ని నిర్మిస్తుండగా.. నాగచైతన్య నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్ ఇదే. క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో వస్తున్న ఈ వెబ్ సిరీస్‌పై మంచి అంచనాలున్నాయి. అయితే, చైతూ బర్త్ డే సందర్భంగా గురువారం దూత ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. చైతూ ఓ న్యూస్ జర్నలిస్ట్ గా కనిపిస్తుండగా.. తనకి సంబంధం లేని ఓ క్రైమ్‌లో ఇరుక్కున్నట్లుగా కనిపిస్తున్నది. అలాగే దర్శకుడు విక్రమ్ కె కుమార్ చూపించిన సస్పెన్స్ ఫ్యాక్టర్ మంచి థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈ ట్రైలర్ మంచి ప్రామిసింగ్‌గా ఉందనే చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1న ప్రైమ్ వీడియోలో పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో స్ట్రీమింగ్ కానుంది.