పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’.వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ భారీ సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్‌కు కూడా కావాల్సినంత హైప్‌ను మేకర్స్ అందిస్తున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత ప్రభాస్ లైనప్‌లో సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ఉన్న ‘స్పిరిట్’పై కూడా సాలిడ్ హైప్ నెలకొంది. ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఆల్రెడీ దర్శకుడు సందీప్ ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు అదనంగా మరింత సాలిడ్ ఇన్ఫో బయటకి వచ్చింది. ఈ సినిమాను 2025లో క్రిస్మస్ రేస్‌లో లేదా 2026 సక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను థియేటర్లలో చూడాలంటే అప్పటివరకు ఆగక తప్పదు