బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వస్తున్నలేటెస్ట్ మూవీ ‘డన్కీ’. పఠాన్, జవాన్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న షారుఖ్.. డన్కీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. షారుఖ్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్లో వసూళ్లు ఏ రేంజ్లో ఉంటాయో పఠాన్, జవాన్ మరోసారి చూపించాయి. అయితే, ప్రస్తుతం డన్కీ ఓవర్సీస్ బుకింగ్స్‌కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన రోజునే ఓవర్సీస్ బుక్సింగ్స్ కూడా స్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అవైటెడ్ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలోకి రాబోతుంది.