జనగాం జిల్లా దేవరుప్పుల మండలంలోని ఓ రైతుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. ‘పొలం ఎండిపోయింది. బిడ్డ పెళ్లి చేసేందుకు డబ్బుల్లేవు’ అని ధరావత్ తండాకు చెందిన ఓ రైతు మాటలకు కేసీఆర్ చలించిపోయారు. వెంటనే ఆ రైతుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. జీవితంపై భరోసా కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రమాదకరంగా మారుతున్న ప్రస్తుత పరిణామాల్లో కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.