Homeహైదరాబాద్latest Newsశ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో లక్ష తులసి అర్చన సందర్భంగా భక్తుల రద్దీ

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో లక్ష తులసి అర్చన సందర్భంగా భక్తుల రద్దీ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారి దేవస్థానము, “శ్రీనృసింహ నవరాత్రోత్సవములలో” భాగంగా నేడు 8వ రోజు ఉదయం పురుషసూక్త, శ్రీసూక్త, కల్పోక్త, న్యాసకపూర్వక షోడశ ఉపచార పూజ, సహస్రనామార్చన, పంచోపనిషత్తులతో మరియు రుద్రాభిషేకము సామవేదపారాయణంతో అభిషేక పూజలు మరియు వాస్తు, యోగిని, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతోభద్ర మండల స్థాపిత దేవతా పూజలు, సహస్ర వరుణ కలశ స్థాపన పూజలు మరియు స్థాపిత దేవత హోమాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమములో ఆలయ ఈవో సకటాల శ్రీనివాస్ వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ, ఉపప్రధాన అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, సిహెచ్ రమణయ్య, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ మరియు అర్చకులు & సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img