హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేలకోట్లను తెలంగాణ బడ్జెట్లో కేటాయించినట్లు ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క వెల్లడించారు. అదేవిధంగా.. జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు, హెచ్ఎండీఏకు రూ.500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ కోసం రూ.3,385 కోట్లు, హైడ్రా సంస్థ రూ.200 కోట్లు, విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ. 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు – రూ. 200 కోట్లను కేటాయించారు.