Homeహైదరాబాద్latest NewsHealth: పిల్లల్లో డెంగ్యూ లక్షణాలుంటే.. ఎలాంటి చికిత్స తీసుకోవాలి?

Health: పిల్లల్లో డెంగ్యూ లక్షణాలుంటే.. ఎలాంటి చికిత్స తీసుకోవాలి?

ఇది జ్వరంతో మొదలవుతుంది. నాలుగైదు రోజులుంటుంది. ఒళ్లునొప్పులుంటాయి. తల, కండరాలు, కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి. కొంతమందికి వాంతులు, కడుపునొప్పి కూడా ఉంటుంది. కొందరికి చర్మంపై ఎర్రదద్దుర్లు వస్తాయి. ఈ లక్షణాలు డెంగ్యూ, వైరల్‌ జ్వరాల్లోనూ ఉంటాయి. డెంగ్యూ జ్వరం వస్తే ఎర్రదద్దుర్లు చర్మంపై వస్తాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. చలితో జ్వరం వస్తే మలేరియాగా అనుమానించాలి. నీరు, ఆహారం కలుషితం అయితే టైఫాయిడ్‌ వస్తుంది.

డెంగ్యూ.. ఎలాంటి చికిత్స తీసుకోవాలి?

  • ప్లేట్‌లెట్‌లు 40 వేల వరకూ ఉంటే సాధారణంగా రక్తస్రావం కాదు.
  • 30 వేల వరకు ఉంటే కొద్దిగా రక్తస్రావం కావొచ్చు.
  • 20 వేలకు పడిపోతే రక్తస్రావం ఎక్కువగా అవుతుంది.
  • 10 వేలు మాత్రమే ఉంటే బ్లీడింగ్‌ విపరీతంగా అవుతుంది.
  • కొన్నిసార్లు రక్తపరీక్షలో ప్లేట్‌లెట్‌ కణాల లెక్కింపులో తప్పులు రావొచ్చు. మరోసారి పరీక్ష చేసుకోవాలి.
  • డాక్టర్లు సూచన మేరకు ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. మంచి బలమైన, పౌష్టికాహారం తినాలి. లిక్విడ్స్‌ ఎక్కువగా తీసుకోవాలి.

Recent

- Advertisment -spot_img