ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సత్తా చాటారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్లో రాణించడంతో వన్డే ర్యాంకింగ్స్లో ఒక ర్యాంక్ మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇది రోహిత్ కెరీర్లో అత్యుత్తమ వన్డే ర్యాంక్ కావడం విశేషం. ప్రస్తుతం మొదటి స్థానంలో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ ఉన్నారు.