నేటి ఆధునిక యుగంలో మారుతున్న కాలానుగుణంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతోంది. ఈ నేపథ్యంలో Vivo, Xiaomi, Huawei వంటి మొబైల్ తయారీ సంస్థలు త్వరలో ఎలాంటి నెట్‌వర్క్ లేకుండా పనిచేసే మొబైళ్లను విడుదల చేయబోతున్నాయి. అంటే ఎలాంటి నెట్‌వర్క్ లేకుండానే కాల్స్, ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లను డైరెక్ట్‌గా శాటిలైట్‌కు కనెక్ట్ చేయడం ద్వారా కాలింగ్, ఇంటర్నెట్‌ను పొందవచ్చు.