పేపర్ కప్పులో టీ తాగితే క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. డిస్పోజబుల్ కప్పులలో అధిక మొత్తంలో బిస్ఫినాల్, BPA కెమికల్స్ ఉంటాయి. ఇలాంటి వాటిలో వేడి వేడి నీరు తాగడం, టీ తాగడం వల్ల కప్పులోని రసాయనాలు టీలో కలుస్తాయి. దీంతో కప్పులో ఉన్న రసాయనాలు పొట్టలోకి వెళ్తాయి. దీర్ఘకాలంలో ఇది క్యాన్సర్కు దారి తీస్తుంది. వీటి తయారీలో బీపీఏ రసాయనాలను ఉపయోగిస్తారు. ఇది కాలక్రమేణా క్యాన్సర్కు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.