Homeజిల్లా వార్తలుప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో తెలియజేయాలి.. డిఈఓ కి వినతి పత్రం అందజేత..!

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో తెలియజేయాలి.. డిఈఓ కి వినతి పత్రం అందజేత..!

ఇదే నిజం, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో తెలియజేయాలని జిల్లా విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో నోటీస్ బోర్డులో ఫీజుల వివరాలు తెలియజేయాలని, అంతేకాకుండా ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారీతిలో అన్యాయంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఏ తరగతికి ఎంత ఫీజు అని నోటీసు బోర్డులో తెలియజేయాలని డీఈవో దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థల పైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని కోరగా, దానికి సానుకూలంగా స్పందించిన డీ.ఈ.ఓ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల పైన చర్యలు తీసుకుంటామని ప్రైవేట్ యాజమాన్యాలు ఏమన్నా ఇబ్బందులకు గురిచేసిన తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు .దానికి గాను భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరఫున డిఈఓ కి కృతజ్ఞతలు తెలుపుతూ, రానున్న రోజుల్లో ప్రభుత్వం దీనిపైన స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని అలాగే కలెక్టరేట్ కార్యాలయంను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు కోడం వెంకటేష్, శ్రీనివాస్, కొలనూరు కరుణాకర్, సంపత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img