Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

తెలంగాణలో రాగల 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Recent

- Advertisment -spot_img