‘పోర్నోగ్రఫీ’.. అంటే అశ్లీల రచన, దృశ్యాలనే అర్థం వాడుకలో ఉంది. పోక్సో చట్టంలో పేర్కొన్న ‘చైల్డ్ ఫోర్నోగ్రఫీ’ పరిభాష బాలలపై జరుగుతున్న లైంగిక దారుణాల తీవ్రతను వాస్తవికంగా ప్రతిబింబించడంలేదని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల ఇకపై ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ అనటానికి బదులుగా ‘చిన్నారులపై లైంగిక పీడన-దుర్వినియోగ అంశం’ (చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్-సీఎస్‌ఈఏఎం)గా వ్యవహరించాలని పార్లమెంట్‌కు తెలిపింది.