హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు జాన్ అమోస్ కన్నుమూశారు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వృద్దాప్య సమస్యలతో అగష్టు 21న చనిపోగా సుమారు 50 రోజుల తర్వాత (అక్టోబర్ 1)న బయటి ప్రపంచానికి తెలియడం అశ్యర్యానికి గురి చేస్తోంది. 1971లో సినిమాల్లోకి వచ్చిన ఆయన రూట్స్, గుడ్ టైమ్స్ సిరీస్‌లతో స్టార్‌గా మారారు. 2023లో వచ్చిన ది లాస్ట్ రైఫిల్ మ్యాన్ ఆయన చివరి సినిమా.