తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. ఇళ్లు లేని నిరుపేదలకు త్వరలో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తాజాగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సొంతగా స్థలం ఉండి ఇల్లు లేదో వారికి తొలి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. రెండో దశలో స్థలం కూడా లేని వారిని గుర్తించి స్థలం కేటాయించి ఇళ్లు మంజూరు చేయనున్నారు. మహిళల పేరుతో ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారులకు సొంత ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఇంటి నిర్మాణం కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలని పేర్కొన్నారు.