రైతు భరోసా కోసం తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెరపడిందని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను వీలైనంత తొందరగా అమలు చేసి.. అటు రైతుల్లో ప్రభుత్వం మీద ఉన్న నిరాశను తీసేయటమే కాకుండా.. ప్రతిపక్షాలకు విమర్శలకు చెక్ పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ ఎలాగైనా రైతు భరోసా హామీని నెరవేర్చాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించగా.. నిధుల సర్దుబాటుకు ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి.. డిసెంబర్ చివరి నాటికి రైతుభరోసాను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.