బంగారం అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ కొనాలి అంటేనే భయమేస్తుంది. అయితే మన దేశంలోని ఓ నదిలో బంగారం కుప్పలుగా కొట్టుకువస్తోంది. అది ఏ నదీ అంటారా అదే స్వర్ణరేఖ నది. దీనినే గోల్డెన్ రివర్ అని కూడా అంటారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 16 కిలో మీటర్ల దూరంలో ఈ నది పుట్టింది. ఈ నదిలో బంగారం అణువులు నీటితో కలిసి ప్రవహిస్తాయి. చాలా మంది జల్లెడ లేదా ఫిల్టర్ పద్ధతిలో బంగారాన్ని సేకరిస్తుంటారు.