నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్ సీజన్-8’ ముగింపు దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది. ఈ సీజన్లో పాల్గొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ ఫినాలేలో సందడి చేశారు. ఈ సీజన్ ప్రైజ్‌మనీ రూ.54,99,999 అని ప్రకటించిన నాగార్జున దానిని రూ.55 లక్షలుగా నిర్ణయించారు. గెలిచిన విజేతకు టైటిల్‌తోపాటు ఈ క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు చెప్పారు.