విఘ్నేష్ శివన్ పాండిచ్చేరిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హోటల్ డిమాండ్‌పై వివాదానికి వివరణ ఇచ్చారు. నటి నయనతార భర్త విఘ్నేష్ శివన్ తమిళంలో ఎన్నో హిట్ సినిమాలకి దర్శకత్వం వహించారు. కాగా, ఇటీవల పుదుచ్చేరి వెళ్లిన దర్శకుడు విఘ్నేష్ శివన్ అక్కడి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రితో సమావేశమయ్యారు. డైరెక్టర్ విగ్నేష్ శివన్ పాండిచ్చేరిలో ఉన్నటువంటి ఓ హోటల్ ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు పాండిచ్చేరి వెళ్లి వచ్చాడని పలు వార్తలు బలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విషయంపై విఘ్నేష్ శివమ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగానే తాను పాండిచ్చేరిలోని ప్రభుత్వానికి సంబంధించిన హోటల్‌ను ఆక్రమిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తన తదుపరి చిత్రం “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” షూటింగ్ అనుమతుల కోసం పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి మరియు ఇతర మంత్రులను కలిశానని కూడా ఆయన చెప్పారు. అయితే తనతో వచ్చిన మేనేజర్ మాత్రం తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ముఖ్యమంత్రితో చర్చించానని, అయితే ఈ విషయాలను తనకు ముడిపెట్టి మీమ్స్, వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన కోరారు. అయితే పాండిచ్చేరిలోని ప్రభుత్వానికి సంబంధించిన హోటల్‌ను ఆక్రమిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.