జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర సర్టిఫికెట్ల కోసం ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునేలా కొత్త యాప్ ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీ పరిధిలో బర్త్, డెత్, మ్యారేజ్, హౌజ్ పర్మిషన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, లే ఔట్ పర్మిషన్ వంటి 20 రకాల సేవలను ఆన్లైన్లోనే అందించేలా ‘మై-పంచాయతీ’ యాప్ ను రూపొందిస్తోంది. గ్రామ సమస్యలపై కూడా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సమాచారం.