రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై పలు విమర్శలు వస్తున్నాయి. సాధారణ మహిళ రూపంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షలో తెలంగాణ తల్లి గురించి ఒక ఆసక్తికర ప్రశ్న వచ్చింది. ఈ గ్రూప్ 2 పరీక్షలో ప్రశ్న పత్రం లో అసలు అయిన తెలంగాణ తల్లి రూపు రేఖలు గురించి ప్రశ్న వచ్చింది.
ఈ క్రింది వాటిలో తెలంగాణ తల్లికి సంబంధించి ఏది సరికాదు ?
(1) తెలంగాణ తల్లి విగ్రహ కిరీటము మరియు వడ్డాణంలో కోహినూరు మరియు జాకబ్ వజ్రముల ప్రతిరూపములను కూర్చినారు.
(2) ఈమె పాదాల మెట్టెలు కరీంనగర్ ఫిలిగ్రీ వెండితో తయారు చేయబడినాయి.
(3) ఈమె గద్వాల్ మరియు పోచంపల్లి చీరలను పోలిన చీరలో ఉంది.
(4) ఈమె ఒక చేతిలో బోనమును పట్టుకుంది.