BSNL: భారతదేశం అంతటా టెలికాం రంగంలో ఆవిష్కరిస్తున్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్-ఫ్రెండ్లీ ప్లాన్‌లను ప్రకటించింది. ఇది కాకుండా, 5Gకి అప్‌గ్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ (BSNL) కొత్త సేవను ప్రారంభించింది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారంగా IFTV (ఇంట్రానెట్ ఫైబర్ TV) సేవను ప్రవేశపెట్టింది. బీఎస్ఎన్ఎల్ కొన్ని రోజుల క్రితం దేశంలోని మరొక రాష్ట్రంలో ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారిత IFTV సేవలను అందించడం ప్రారంభించింది. ఈ సేవను పొందుతున్న వినియోగదారులు 500 కంటే ఎక్కువ ప్రత్యక్ష ప్రసార టీవీ ఛానెల్‌లను ఉచితంగా చూడవచ్చు. ‘సెట్-టాప్ బాక్స్’ అవసరం లేకుండానే ఈ సర్వీసును అందించడం దీని ప్రత్యేకత. BSNL ఈ కొత్త సర్వీస్ గురించి 2024లో ప్రకటించింది. దీని ప్రకారం ఒక్కో రాష్ట్రానికి ఈ సర్వీస్ విస్తరిస్తోంది. BSNL ఇటీవల పుదుచ్చేరిలో BiTV అనే డైరెక్ట్-టు-మొబైల్ (D2M) సేవను ప్రారంభించింది.ఈ సేవలను ప్రవేశపెట్టడం టెలికాం రంగంలో భారీ మార్పుకు దారితీస్తోంది.