Homeసినిమాకృతీకి తెలుగు నేర్పుతున్న ఆదిపురుష్ టీం

కృతీకి తెలుగు నేర్పుతున్న ఆదిపురుష్ టీం

‘అందరికీ నమస్కారం..  బాగున్నారా! యాక్చువల్లీ ఐ డోంట్‌ నో తెలుగు. నెక్ట్స్‌ టైమ్‌ ఐ విల్‌ స్పీక్‌ ఇన్‌ తెలుగు..’ అంటూ తెలుగు చిత్రాల్లో నటించే పరభాషా తారలు అనడం పలు వేడుకల్లో విన్నాం.

‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగుకి పరిచయం అయిన బాలీవుడ్‌ భామ కృతీ సనన్‌ కూడా అలానే అన్నారు.

ఆ తర్వాత కూడా పెద్దగా తెలుగు నేర్చుకోలేదామె. ఇప్పుడు నేర్చుకునే పని మీద ఉన్నారు.

ఔం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ సరసన కృతీ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో ప్రభాస్‌ది రాముడి పాత్ర. కృతీది సీత పాత్ర.

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్యూటర్‌ని పెట్టి, కృతీకి తెలుగు నేర్పిస్తోందట చిత్రబృందం. సో.. ఈ సినిమా వేడుకలో ‘అందరికీ నమస్కారం. నాకు తెలుగు వచ్చేసింది’ అని కృతీ అంటారేమో చూడాలి.

Recent

- Advertisment -spot_img