Homeసినిమాడిఫరెంట్‌గా రాశి పాత్ర

డిఫరెంట్‌గా రాశి పాత్ర

తెలుగు తెరపై తెల్లగులాబీలా రాశి ఖన్నా కనిపిస్తుంది. అమాయకత్వంతో కూడిన అందం రాశిఖన్నా ప్రత్యేకత.

నిదానమే ప్రధానం అన్నట్టుగా ఆమె ఒక్కో సినిమాను చేసుకుంటూ వెళుతోంది.

అందువలన ఆమె కెరియర్ గ్రాఫ్ తారాజువ్వలా దూసుకుపోయినట్టుగా ఎక్కడా కనిపించదు.

కానీ ఇచ్చిన పాత్రకు గ్లామర్ ను .. నటనను కలిపి ముట్టజెబుతుంది.

అలాంటి ఈ పిల్లతో ‘సుప్రీమ్’ సినిమాలో అనిల్ రావిపూడి కామెడీ చేయించాడు. ఆ సినిమాలో బెల్లం శ్రీదేవిగా ఆమె కుర్రాళ్ల గుండె కోటలను కూలగొట్టేసింది.

ఆ తరువాత లాక్ డౌన్ కి ముందు వచ్చిన ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలో ఆమెతో దర్శకుడు మారుతి కామెడీని చేయించాడు.

ఈ సినిమాలో రాశిఖన్నా పోషించిన టిక్ టాక్ స్టార్ ఎంజిల్ ఆర్నా పాత్రకి కూడా మంచి మార్కులు పడ్డాయి.

దాంతో ఈ సారి కూడా మారుతి ఆమె పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేస్తూ కామెడీ టచ్ ఇచ్చాడట.

గోపీచంద్ హీరోగా ఆయన ‘పక్కా కమర్షియల్’ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో తెరపై తాను కనిపిస్తున్నంత సేపు రాశి ఖన్నా నవ్విస్తూనే ఉంటుందట. ఈ పాత్ర కూడా ఆమెకి మంచి పేరును తీసుకురావడం ఖాయమని అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌లు..

నాకు ఆ ఇమేజ్ మాత్ర‌మే వ‌ద్దు

భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తా..

తమిళ ఇండస్ట్రీపై కన్నేసిన రాశి

చిరకట్టులో ఆకట్టుకుంటున్న రాశీ ఖన్నా

సోకులతో చంపేస్తున్న రాశీ ఖన్నా

Recent

- Advertisment -spot_img