ఇదే నిజం, గొల్లపల్లి: జపాన్ జాతీయ సైన్స్ ప్రోగ్రామ్ “సుకుర”లో భాగంగా జపాన్ వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని అంచనా వేయడానికి భారతదేశం నుండి నిర్వహించిన ఎంపిక పోటీలో ఆదర్శ పాఠశాల విద్యార్థిని కలకోట శ్రీజ ఐదవ స్థానం సాధించి రిజర్వ్ సీటుగా ఎంపికైంది.ఈ పోటీలు రాష్ట్ర స్థాయిలో ఎస్ సి ఇ ఆర్ టి( రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ)హైదరాబాదులో జరిగాయి.33 జిల్లాల నుండి ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రతిభ చూపిన ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేశారు.ఐదవ స్థానంలో నిలిచిన కలకోట శ్రీజను రిజర్వ్ స్థానానికి ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ విద్యార్థినిని అభినందించారు.పాఠశాల విద్యార్థిని సుకుర పోటీలకు ఎంపిక కావడం వెనుక విద్యార్థిని కృషి,పాఠశాల ప్రోత్సాహం ఉందని తెలియజేశారు. జిల్లా స్థాయిలో గణితం,సైన్స్,ఇంగ్లిష్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన శ్రీజ అగ్రస్థానం,రాష్ట్ర స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ,కరెంట్ అఫైర్స్‌లో నిర్వహించిన రాత పరీక్ష,ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభలో ఐదవ స్థానం సంపాదించింది. శ్రీజను పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్‌తో పాటు,వైస్ ప్రిన్సిపాల్ నగేష్,గైడ్ టీచర్ పెద్దన్న,ఉపాధ్యాయులు అరుణ్‌కిరణ్, జి.వి.రమణ, రాజశేఖర్, రాజేందర్, సతీష్‌కుమార్, మురళీధర్, సంధ్యారాణి, జి.సంధ్య, రమాదేవి, హరిప్రియ, ఆర్.సంధ్య విద్యార్థినిని అభినందించారు.