Homeహైదరాబాద్latest Newsలెజెండరీ అవార్డు గ్రహీత ఆచార్య గాలిపెల్లి చోలేశ్వర్ చారికి సన్మానం

లెజెండరీ అవార్డు గ్రహీత ఆచార్య గాలిపెల్లి చోలేశ్వర్ చారికి సన్మానం

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కవి సూక్ష్మ కళాకారుడు ఆచార్య గాలిపెల్లి చోలేశ్వర్ చారికి సూక్ష్మ కళాకారుడిగా,ఆర్టిస్టుగా జాతీయస్థాయిలో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారి విశిష్ట పురస్కారం అయినటువంటి విశ్వకర్మ లెజెండరీ అవార్డు పొందటంను పురస్కరించుకొని జగిత్యాల పట్టణ విశ్వకర్మ స్వర్ణకార సంఘం సభ్యులు ఈరోజు జగిత్యాల జిల్లా పట్టణంలోని సంఘ భవనంలో పట్టణ అధ్యక్షుడు గన్నేరువరం బుచ్చన్న ప్రధానకార్యదర్శి గుగ్గిళ్ళ సత్యనారాయణ ప్రత్యేకంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆచార్య గాలిపెల్లి చోళేశ్వర్ చారి మాట్లాడుతూ కుల బాంధవులు నుండి లభించేటువంటి సత్కారం గొప్పదైనదిగా స్వీకరిస్తూ,తన యొక్క బాధ్యతని మరింత పెంచుతుందని అన్నారు. కళాకారుడిగా నన్ను ఎల్లవేళల ప్రోత్సహిస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సభ్యులు ఇలాగే ప్రోత్సహిస్తున్నంత కాలం విశ్వబ్రాహ్మణ ఖ్యాతిని తన శక్తి మేర తను వెళ్ళినంత వరకు తీసుకువెళ్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రంగు రాజయ్య,పట్టణ స్వర్ణకార సభ్యులందరూ పాల్గొని చోళేశ్వరాచారికి అభినందనలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img