ఫార్ములా ఈ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. ఇవాళ ఉదయం ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చి లీగల్ టీమ్‌కు అనుమతించాలని కోరిన కేటీఆర్ అయితే తాజా నోటీసులో కూడా లీగల్ టీమ్‌కు అనుమతి లేదని ఏసీబీ వెల్లడించింది.