యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రూ.100 కోట్ల విరాళం అందించారు. ఈ మేరకు చెక్‌ను సీఎం రేవంత్‌కు అందించారు. స్కిల్ వర్సిటీని రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచనపై అదానీ ప్రశంసలు కురిపించారు.